ఆర్టీసీకి సీజేఐ ఎన్వీ రమణ లేఖ.. స్పందించిన సజ్జనార్ ఏం చేశారంటే.?

by Anukaran |   ( Updated:2021-11-04 01:02:56.0  )
ఆర్టీసీకి సీజేఐ ఎన్వీ రమణ లేఖ.. స్పందించిన సజ్జనార్ ఏం చేశారంటే.?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ.. టీఎస్‌ఆర్టీసీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎండీ సజ్జనార్ వెంటనే బస్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మాచారం మండలం చిదేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా బడులు మూతపడటంతో బస్సులు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం స్కూల్స్ తెరిచినా బస్సు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో తెలియక మా ఊరికి బస్ వేయించండి సార్ అని వైష్ణవి ఏకంగా సీజేఐకి లేఖ రాసింది. ఆ లేఖ చదివిన సీజేఐ వెంటనే టీఎస్ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు.

దీనిపై సజ్జనార్ స్పందించారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం అవసరం ఉందన్న విషయాన్ని వైష్ణవి.. ధైర్యంగా వెలుగులోకి తీసుకరావడం అభినందనీయమని మెచ్చుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేయాలని సజ్జనార్ సూచించారు. వెంటనే బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ నిర్ణయం‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి వైష్ణవి ఆలోచన ప్రతీ ఒక్కరిలోనూ రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నెల 12న మరో మిలియన్ మార్చ్.. ట్యాంక్ బండ్ మరోసారి రణరంగం కానుందా?

Advertisement

Next Story

Most Viewed