- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో 20నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు !
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో 20నుంచి సిటీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 20న బస్సు సర్వీసులను ప్రారంభించగా అప్పటి నుంచి జిల్లాల్లో దాదాపు 3వేల బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. అయితే విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పటివరకు సిటీ బస్సులను ప్రారంభించలేదు. 20-26వరకు సచివాలయ ఉద్యోగాల కోసం రాతపరీక్షలు ఉండగా 10లక్షల మంది హాజరు కానున్నారు. దాంతో పరీక్ష రాసే అభ్యర్థులకోసం రవాణా ఏర్పాటు చేయాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగాల పరీక్షల నేపథ్యంలో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం ఫైల్‌ను పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Advertisement
Next Story