రూ. 50 లక్షలు చెల్లించాలి : సీఐటీయూ

by srinivas |   ( Updated:2020-06-29 22:20:04.0  )
రూ. 50 లక్షలు చెల్లించాలి : సీఐటీయూ
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ విశాఖ జిల్లా కార్యాదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రమాద ఘటన తెలుసుకున్న కంపెనీ ఉద్యోగులతో పాటు, పరిసర కంపెనీల కార్మికులు కూడా సాయినార్ కంపెనీ దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో కంపెనీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కంపెనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియాను అడ్డుకున్నారు. దీంతో కంపెనీకి చెందిన ఉద్యోగులు ఆందోళన చేపట్టి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story