అధికారుల నిర్లక్ష్యం.. సీఐటీయూ సర్వే

by  |
అధికారుల నిర్లక్ష్యం.. సీఐటీయూ సర్వే
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట రూరల్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు రేవంత్ కుమార్ మాట్లాడుతూ.. అధికారులు నిర్లక్ష్యం కారణంగా మల్లన్న సాగర్ కాలువ నుంచి, తూము ఎత్తులో కట్టడం మూలంగా చుక్క నీరు కూడా రావడం లేదని, వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్‌లు త్వరితగతిన పూర్తి చేయాలని, లబ్దిదారులకు ఇల్లు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజనం పథకాన్ని విద్యార్థులుకు అందివ్వాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన ప్రతి కుంటుంబానికి రూ.7500 ఇవ్వాలని, ఉపాధి పని దినాలు 200 రోజులకు పెంచాలని, రేషన్ కార్డు లేని వారికి 10 కిలోల రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed