- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జల్‌పల్లిలో కలకలం.. CISF కానిస్టేబుల్ మిస్సింగ్
దిశ, జల్‌పల్లి: ఇంటి నుంచి డ్యూటీకి వెళ్ళిన CISF కానిస్టేబుల్ అదృశ్యమైన ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పహాడిషరీఫ్ ఎస్ఐ ప్రభులింగం వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామం సీఐఎస్ఎఫ్ కాంప్లెక్స్‌కు చెందిన అన్నెపు అప్పలనాయుడు(34)-కృష్ణవేణిలు దంపతులు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు సంతానం. అప్పలనాయుడు CISF కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా భార్య కృష్ణవేణి కూడా CISFలో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
అయితే, అప్పలనాయుడు ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరాడు. రోజు మాదిరి సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి రావాల్సి ఉండగా, రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల ఇళ్ళలో వెతకసాగారు. అయినా ప్రయోజనం కనిపించకపోవడంతో భార్య కృష్ణవేణి పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.