ఊరికే మెగాస్టార్ అయిపోరు.. ఆ విషయంలో కొడుకుతో పోటీ పడుతున్న చిరంజీవి.. లుక్ అదురిపోయిందిగా

by Kavitha |   ( Updated:9 Sept 2024 10:30 AM  )
ఊరికే మెగాస్టార్ అయిపోరు.. ఆ విషయంలో కొడుకుతో పోటీ పడుతున్న చిరంజీవి.. లుక్ అదురిపోయిందిగా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నటనలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అందులో మెగా స్టార్ చిరంజీవి గారి గురించి అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు యాడ్స్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాడు. తాజాగా చిరంజీవికి (Chiranjeevi ) సంబంధించిన ఒక యాడ్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది..

సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు.. సినిమాలతో పాటుగా యాడ్స్‌లో కూడా పలకరిస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఖైదీ 150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొత్త యాడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆ యాడ్ వీడియోనే నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా వరుస సినిమాలు లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు. అలాగే ప్రముఖ బ్రాండ్స్‌కు బ్రాండ్ ఎంబాసిడర్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి చేరాడు. అందులో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చిరంజీవి కంట్రీ డిలైట్(country delight) అనే పాల యాడ్ చేశారు. యాడ్‌లో కూడా డ్యుయల్ రోల్‌లో నటించి మెప్పించారు. చిరంజీవితో పాటు కమెడియన్ సత్య కూడా నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు ఊరికే మెగాస్టార్ అయిపోరు కదా మినిమమ్ ఉంటది అని, వావ్ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ యాడ్‌ను చూసేయండి.

(video link credits to country delight YouTube channel)

Advertisement

Next Story

Most Viewed