Chhava : "ఛావా" వివాదానికి చెక్ పెట్టిన డెరైక్టర్.. అసలేంటి ఈ వివాదం?

by M.Rajitha |
Chhava : ఛావా వివాదానికి చెక్ పెట్టిన డెరైక్టర్.. అసలేంటి ఈ వివాదం?
X

దిశ, వెబ్ డెస్క్ : మరాఠ వీరుడు ఛత్రపతి మహరాజ్(Chatrapati Maharaj) కుమారుడు శంభాజీ మహరాజ్(Shambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో "ఛావా"(Chhava) అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై మహారాష్ట్రలో అనేక సినీ, రాజకీయ విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్లో శంభాజీ డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్న దృశ్యాలపై వివాదం రేగుతోంది. సినీ విమర్శకులతోసహ ఆ రాష్ట్ర ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ గొడవ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Phadnavis) స్పందిస్తూ.. శంభాజీ మహరాజ్ అంటే ప్రజల్లో ఎంతో భక్తి, అభిమానం ఉందని, ముఖ్యపాత్ర హీరోయిజాన్ని పెంచడానికి చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. మరో మంత్రి ఉదయ్ సావంత్ ఆయా సన్నివేశాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాక, వెంటనే ఆ సీన్లని డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇక మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన(MNS) అధినేత రాజ్ ఠాక్రే(Raj Thackeray) ఈ విషయంలో సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజ్ ఠాక్రేతో ప్రత్యేక సమావేశం అనంతరం లక్ష్మణ్ ఉటేకర్ ఓ ప్రకటన జారీ చేశారు. రాజ్ ఠాక్రే సలహాలు, సూచనలతో.. శంభాజీ మహరాజ్ లెయిమ్ డ్యాన్స్ చేస్తున్న సీన్లను తొలగించడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాము "ఛావా" పుస్తకం హక్కులను తామే తీసుకున్నామని, అందులో ఉన్నదే చూపించే ప్రయత్నం చేశామని అన్నారు. లెయిమ్ డ్యాన్స్ మహారాష్ట్రలో సంస్కృతిలో భాగం అని, కానీ శంభాజీ కంటే తమకు డ్యాన్స్ ఎక్కువ కాదని అన్నారు. పలువురు రీసెర్చ్ స్కాలర్స్, చరిత్ర కారులకు ఈనెల 29న ప్రత్యేక షో వేస్తామని.. వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళతామని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed