- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vishwak Sen: నాకు భయమే తెలీదు.. ఆ జానర్ లో ఎప్పటికీ సినిమా చెయ్యను అంటున్న విశ్వక్ సేన్.. ఎందుకో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన అభిమానుల కోసం సినిమాలను చేస్తుంటాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై విశ్వక్ హీరోగా ‘లైలా’ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్ లో దర్శనమివ్వనున్నాడు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించనుంది. చిత్రం బృందం కూడా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.
వరల్డ్ వైడ్ గా " లైలా " ( Laila ) చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా విశ్వక్ ( ( Vishwak Sen ) ) మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ప్రశ్నలు అడగగా .. వాటికీ సమాధానాలు ఇచ్చాడు. విశ్వక్ కమర్షియల్ తో పాటు కొత్త కొత్త కథలను కూడా ఎంచుకుని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే అన్ని రకాలు ప్రయత్నిస్తున్నారు, మరి హారర్ జానర్ లో ఇప్పటి ఎందుకు చెయ్యలేదనే ప్రశ్న ఎదురైంది.
దీనికి విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ గా సమాధానమిచ్చాడు.. " నేను హారర్ జానర్ చెయ్యను.. ఇప్పుడే కాదు .. ఎప్పటికీ చెయ్యను .. ముందు ముందు కూడా నా నుంచి ఇలాంటి సినిమాలు రావు. ఎందుకంటే, నేను హారర్ మూవీస్ కి అసలు భయపడను.. కొందరు చాలా భయపడ్డాం అని చెబుతుంటారు..అలాంటి సినిమాలకు నేనొక్కడ్నే వెళ్లి చూశా .. హారర్ మూవీస్ కి , ఆ శబ్దాలకు అసలు భయపడను. ఊరికి చివర నన్నొక్కడ్ని వదిలేసి వచ్చినా .. సైలెంట్ గా నా పని నేను చేసుకుంటా తప్ప అసలు భయపడను. స్మశానంలో కూడా నేను సంతోషంగా ఉంటాను. ఒక దయ్యం మనిషిని చంపింది అని ఎక్కడా లేదు.అందుకే నేను భయపడను. హారర్ భయం నాకు తెలియనప్పుడు నేను ఆ సినిమా ఎలా చేయగలను .. చేయలేను కదా" అంటూ తెలిపాడు. ఈ ఆన్సర్ తో ప్రేక్షకులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఎన్ని రకాల జానర్స్ చేసిన విశ్వక్ నుంచి హారర్ జానర్లో సినిమా మాత్రం రాదని అర్థమైంది.