Vishwak Sen: ఇంటర్నేషనల్ ఫిగర్‌ను పట్టుకుని KPHB ఆంటీ అంటావా.. సంచలనంగా విశ్వక్ కామెంట్స్

by sudharani |   ( Updated:2025-01-25 14:21:53.0  )
Vishwak Sen: ఇంటర్నేషనల్ ఫిగర్‌ను పట్టుకుని KPHB ఆంటీ అంటావా.. సంచలనంగా విశ్వక్ కామెంట్స్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), డైరెక్టర్ రామ్ నారాయణ్ (Ram Narayan) కాంబోలో వస్తు్న్న తాజా చిత్రం ‘లైలా’(Laila). ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తు్న్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కాగా.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే హీరో విశ్వక్ సేన్ ఓ ఊహించనటువంటి ప్రశ్న ఎదురైంది.

‘లైలా’ చిత్రంలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ (Dual role) ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి లేడీ గెటప్ (Lady getup) కాగా.. ఈ గెటప్‌పై ఓ రిపోర్టర్ (Reporter) ‘ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న మోనాలిసా (MonaLisa) ఎంత అందంగా ఉందో మీ లైలా గెటప్ అంత అందంగా ఉందని కొందరు అంటుంటే.. మరికొంత మంది మాత్రం KPHB ఆంటీ టైప్‌లో ఉందని అంటున్నారు.. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటీ’ అంటూ విశ్వక్‌ను ప్రశ్నించాడు. దీనిపై విశ్వక్ స్పందిస్తూ.. ‘ఎంత అన్యాయం అసలు.. ఆ పోలిక ఏంటీ అసలు. ఇంటర్నేషనల్ ఫిగర్‌ను పట్టుకుని KPHB లో పెడతావా నువ్వు’ అంని నవ్వుతూనే సీరియస్ కౌంటర్ ఇచ్చాడు హీరో. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. విశ్వక్‌కు కొంత మంది సపోర్ట్ చేస్తుండగా.. ‘పబ్లిక్ సినిమా ఈవెంట్‌లో అడగడం అసహ్యకరమైన ప్రశ్న! అతను ఇలా అడగడం ఇదే మొదటిసారి కాదు’ అని ‘సినిమా ఈవెంట్స్‌లో మితిమీరుతున్న జర్నలిస్టుల ప్రశ్నలు’ అంటూ రిపోర్టర్‌పై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed