Vijay-Rashmika: మరోసారి అడ్డంగా దొరికిపోయిన విజయ్-రష్మిక.. ట్రెండింగ్‌లోకి వచ్చేసిన వీడియో

by Hamsa |
Vijay-Rashmika: మరోసారి అడ్డంగా దొరికిపోయిన విజయ్-రష్మిక.. ట్రెండింగ్‌లోకి వచ్చేసిన వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రేమించుకుంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు సినిమాల్లో నటించడంతో ప్రేమ మొదలైనట్లు గత కొద్ది కాలంగా నెట్టింట పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాంటి వార్తలపై వీరిద్దరు ఎన్ని సార్లు రియాక్ట్ అయినప్పటికీ రూమర్స్ ఆగడం లేదు. ఆ లవ్ బర్డ్స్ ఎక్కడికి వెళ్లినా నిమిషాల్లో పట్టేస్తున్నారు నెటిజన్లు. ఆధారాలతో సహా నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటారు.

నిత్యం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మరోసారి రష్మిక, విజయ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో ట్రెండ్ అవుతోంది. వీరిద్దరు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు ముంబై(Mumbai)కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్‌(Airport)కు వెళ్లిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో విజయ్ బ్లాక్ క్యాప్, గ్రీన్ షర్ట్ ధరించగా.. రష్మిక కూడా బ్లాక్ టీ షర్ట్‌తో కనిపించడంతో వీరిద్దరు కలిసే వెళ్తున్నారనే చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Next Story