VD12: రెండు పార్టులుగా విజయ్ దేవరకొండ మూవీ.. హైప్ పెంచేస్తున్న ప్రొడ్యూసర్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-12-27 11:30:10.0  )
VD12: రెండు పార్టులుగా విజయ్ దేవరకొండ మూవీ.. హైప్ పెంచేస్తున్న ప్రొడ్యూసర్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’(Family star)తో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. ప్రజెంట్ ‘VD12’తో బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్(Sitara Entertainment) బ్యానర్‌పై నాగవంశీ(Nagavanshi) ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాడు.

‘‘VD12’ రెండు పార్టులుగా రాబోతుంది. ఈ ఆలోచ‌న సినిమా తీస్తున్న టైంలో రాలేదు. స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఈ ఆలోచ‌న వ‌చ్చింది. అసలు సెకండ్ పార్ట్ తీయకపోయిన ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అంత క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి.. ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి అసలు సంబంధం ఉండదు. మేము అనుకున్నప్పుడు అది రెండు పార్టులుగా అనుకున్నాం. సెకండ్ పార్ట్ తీయాలి కాబట్టి.. ఫస్ట్ పార్ట్‌లో సస్పెన్స్ అనేది ఏమి ఉండదు. రెండు సపరేట్ కథలు అవి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ నిర్మాత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed