- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vettaiyan Review : గురిపెట్టాడు.. లక్ష్యం మరిచాడు
సినిమా పేరు: వెట్టయన్,
నటీనటులు: సూపర్‌స్టార్ రజనీకాంత్, అమితాబచ్చన్, ఫహాద్ షాజిల్, రానా దగ్గుబాటి, మంజువారియర్ తదితరులు
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: టిజే జ్క్షానవేల్, సంగీతం: అనిరుధ్
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్, సుభాస్కరన్
గత కొంతకాలంగా సూపర్‌స్టార్ ఇమేజ్ వున్న రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ.. అందులో తన ఇమేజ్‌కు సరిపోయే అంశాలతో ఫ్యాన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్‌ను జత చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. జైలర్ చిత్రంతో అలరించిన రజనీకాంత్ మరోసారి వేట్టయాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.జై భీమ్ చిత్రంతో అందరి నుంచి అభినందనలు అందుకున్న దర్శకుడు టిజే జ్క్షానవేల్ ఈచిత్రానికి దర్శకత్వం వహించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. రజనీకాంత్‌తో పాటు ఈ చిత్రంలో బిగ్‌బి అమితాబచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా కూడా ముఖ్యపాత్రలో నటించాడు. అయితే పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా వుంది? రివ్యూలో తెలుసుకుందాం
కథ: రజనీకాంత్ (అథియాస్) దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్‌మోస్ట్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేశాడని రుజువైతే న్యాయస్థానం శిక్షించే వరకు ఉపేక్షించే ఆఫీసర్ కాదు. ఎన్‌కౌంటర్ చేసి ఆ తప్పు మరొకరు చేయకుండా చూసుకోవడమే తన కర్తవ్యంలా భావిస్తుంటాడు. ఇలాంటి ఆఫీసర్‌ను శరణ్య అనే టీచర్ (దుశరా విజయన్) మర్డర్ హత్య మనోవేదనకు గురిచేస్తుంది. నేరస్థుడిని వెతికి పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తాడు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను మానవ హక్కుల కోసం పనిచేసే రిటైర్ జడ్జి సత్యదేవ్ ( అమితాబచ్చన్) తప్పుపడతాడు. ఆ తరువాత జరిగిందేమిటి? సత్యదేవ్, అథియాస్ చేసిన ఎన్‌కౌంటర్‌ను ఎందుకు తప్పు పట్టాడు? శరణ్య కేసును మళ్లీ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఈ పరిశోధనలో బ్యాటరీ ( ఫహాద్ ఫాజిల్), నటరాజ్ ( రానా దగ్గుబాటి) కు సంబందమేమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ: జైభీమ్ తరువాత దర్శకుడు టిజే జ్క్షానవేల్ మరో సామాజిక సందేశంతో న్యాయం, విద్య అనే ఉదాత్తమైన పాయింట్‌ను తీసుకుని ఈ కథను రాసుకున్నాడు. అయితే కథలో సారాంశానికి తగిన విధంగా ఉత్సుకత కలిగించే సన్నివేశాలు లేకపోవడంతో భారమంతా రజనీకాంత్‌పై వేశాడు. క్రైమ్ థ్రిల్లర్ అంశానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అనే పాత్రని క్రియేట్ చేసి కథాంశంలో ఆసక్తిని పెంచినా దానిని నడిపించడంలో తడబడ్డాడు. ముఖ్యంగా సెకండాఫ్ సాగతీతలో అది స్పష్టంగా కనిపిస్తుంది. తొలిభాగం వేగంగా కదిలిన రెండోభాగానికి వచ్చేసరికి కథనం నెమ్మదించింది. ఇలాంటి కథల్లో వుండాల్సిన ట్విస్ట్‌లు లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. రానా దగ్గుబాటి పాత్ర ఎంట్రీ కూడా ఆలస్యంగా వుందనిపించింది. సినిమా ముగింపులో ఈ పాత్ర వచ్చేసరికి ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. సినిమాలో తదుపరి సన్నివేశం ఏమిటనేది ప్రేక్షకులు సులువుగా ఊహించేసరికి కథనంలో పట్టు తప్పినట్లు అనిపించింది.
నటీనటుల పనితీరు: ఎన్‌కౌంటర్స్ ప్రత్యేక అధికారిగా రజనీకాంత్ నటనే ఈ చిత్రానికి పెద్ద ప్లస్.. కథ పరంగా ఎన్నో మైనస్‌లను ఆయన స్టయిల్, స్వాగ్, నటన కవరు చేసింది. రజనీకాంత్ జైలర్ తరహాలో మరోసారి వయసు తగ్గ పాత్రలో ఆకట్టుకున్నాడు. అనవసరమైన డ్యూయట్ సాంగ్ లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద రిలీఫ్. సత్యదేవ్‌గా అమితాబచ్చన్ పాత్ర గంభీరంగా కనిపిస్తుంది. బ్యాటరీగా ఫహాద్ ఫాజిల్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమాలో ఆయన పాత్రే వినోదాన్ని పంచింది. మంజు వారియర్, రితికా సింగ్ పాత్రల మేరకు నటించారు. అనిరుధ్ బీజీఎమ్ ఫర్వాలేదనిపించింది.కాకపోతే కథనంలో వేగం పెంచడానికి ఆయన నేపథ్య సంగీతం కూడా ప్లస్ కాలేదు. సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కు తగ్గనట్టుగా వుంది. దర్శకుడు ఎంచుకున్న కథా ఆలోచన బాగున్నా.. రచనలో అందుకు తగ్గ కసరత్తులు జరగలేదు. కథ విషయంలో, గ్రిప్పింగ్ సన్నివేశాల విషయంలో మరింత శ్రద్ధ పెడితే సినిమా రక్తికట్టేది.
ఫైనల్‌గా : గురిపెట్టాడు.. లక్ష్యం మరిచాడు
రేటింగ్ :2.5/5