- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
తెలుగు సినిమా సెట్‌లో ఆ హీరోతో చాలా ఇబ్బంది పడ్డా.. వరుణ్ సందేశ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: వరుణ్ సందేశ్(Varun Sandesh) హీరోగా నటించిన ‘కొత్త బంగారు లోకం’(Kotha Bangaru Lokam) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్వేతా బసు(Shweta Basu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తుంది అని అనుకున్నారు ఆడియన్స్. అయితే ఈ చిత్రం తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్‌కు పూర్తిగా దూరమైంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నాను. నాకు నచ్చిన సినిమాలు చేశాను. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్‌లో చాలా ఇబ్బంది పడ్డా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువ ఉన్నానని సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు. హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో 5అడుగులు ఉందని అనేవారు.
ఇక హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తుండేవాడు. గందరగోళానికి గురి చేసేవాడు. రీటేక్స్ ఎక్కువగా తీసుకునేవాడు. తెలుగులో డైలాగ్స్ నేర్చుకుని షూట్‌లో నెట్టుకొచ్చేదాన్ని. అతను మాత్రం అలా కాదు. మాతృభాష తెలుగు అయినప్పటికీ అతనికి భాషపై కంట్రోల్ లేదు. కానీ నన్ను మాత్రం నా కంట్రోల్‌లో లేని ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా.. దానికి నేనేం చేసేది. నాకు తెలిసి నేను అంత బాధ పడిన సెట్ ఏదైనా ఉందంటే అదే’ అని శ్వేతా బసు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.