Shilpa Shetty: బాలీవుడ్ బ్యూటీ వర్కింగ్ ఉమెన్‌కు చెప్పిన విలువైన సూత్రాలివే..!

by Anjali |
Shilpa Shetty: బాలీవుడ్ బ్యూటీ వర్కింగ్ ఉమెన్‌కు చెప్పిన విలువైన సూత్రాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి(Bollywood beauty Shilpa Shetty) వర్కింగ్ ఉమెన్ కోసం కొన్ని విలువైన సూత్రాలను చెప్పింది. మహిళలు ఎప్పుడైనా సరే హెల్తీ ఫుడ్(Healthy food) తీసుకోవాలని తెలిపింది. అంటే.. పోషకాలు అధికంగా ఉండి.. ఈజీగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పుకొచ్చింది. అలాగే ధ్యానం(meditation) బెస్ట్ వే అని మహిళలకు సూచించింది. ఒక పనిమీద ఫోకస్ చేయ్యాలంటే మైండ్ ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా చేయగలమని పేర్కొంది. మీ ఫ్యాషన్ నే మీ బలంగా మార్చుకోండని తెలిపింది. ఎప్పుడైనా సరే మన గురించి సొసైటీ ఏం మాట్లాడుకుంటోందనేది పక్కన పెట్టండని వెల్లడించింది.

మాతృత్వాన్ని(motherhood) ప్రతి క్షణం ఆస్వాదించండని.. ఇతరుల కారణంగా ప్రశాంతత కోల్పోవద్దని వివరించింది. అలాగే మేల్ ప్రొషెషనల్స్(Male Professionals) అండ్ ఉమెన్ ప్రొఫెషనల్స్(Women Professionals) మధ్య తేడా అనేది ఉండకూడదని.. వర్క్ చేస్తోన్న ప్రతి ఒక్కరిని ప్రొఫెషనల్‌గా మాత్రమే చూడాలని సూచించింది. వీటితో పాటు ఏ చిన్న విషయాలకు నిరాశ చెందకుండా కష్టపడి చేయండని తెలిపింది. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండని పేర్కొంది. ఆపదలో ఉన్నవారికి హెల్ప్ చేయమని సూచించింది.

Next Story

Most Viewed