ఎట్టకేలకు క్లీంకార ఫొటో షేర్‌ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్‌గా ఉందో అంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2024-12-13 05:15:15.0  )
ఎట్టకేలకు క్లీంకార ఫొటో షేర్‌ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్‌గా ఉందో అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ జంటకు గతేడాది జూన్ 20న ఒక పాప పుట్టింది. ఆమెకు క్లీంకార అనే పేరు కూడా పెట్టారు. కానీ, ఇప్పటి వరకు ఈ లిటిల్ ప్రిన్సెస్ ఫేస్‌ని మాత్రం వీళ్లు రివీల్ చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారాను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఉపాసన మెగా ప్రిన్సెస్ క్లీంకార కొణిదెల ఫొటోను షేర్ చేసింది. రామ్ చ‌ర‌ణ్ – ఉపాస‌న దంప‌తుల గార‌ల‌ప‌ట్టి క్లీంకార గుడికి వెళ్లింది. త‌న తాత‌య్య‌తో క‌లిసి అపోలో ఆసుప‌త్రిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకుంది. ఈ విష‌యాన్ని ఉపాస‌న సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

‘ముత్తాత (ఉపాసన తాతయ్య ప్ర‌తాప్ రెడ్డి), తాతయ్య (ఉపాసన తండ్రి అనిల్ కామినేని)తో కలిసి క్లీంకార అపోలో ఆస్పత్రిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గోంది. క్లీంకార‌ను త‌న తాతయ్య ఎత్తుకోవ‌డం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది’ అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్టు చివరిలో ‘ఓం నమో వేంకటేశాయ’ అని కూడా రాసుకొచ్చింది మెగా కోడలు. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అబ్బా క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఫొటోలో తన గారాల పట్టి ఫేస్‌ని ఉపాసన కొంచెం బ్లర్ చేసి షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed