అలాంటి పోస్టులు పెట్టడంతో హీరోయిన్‌కు బిగ్ షాకిచ్చిన ట్విట్టర్.. ఆమె రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)

by Hamsa |
అలాంటి పోస్టులు పెట్టడంతో హీరోయిన్‌కు బిగ్ షాకిచ్చిన ట్విట్టర్.. ఆమె రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్(Swara Bhaskar) ‘మధోలాల్ కీప్’(Madholal Keep)సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా ఈ అమ్మడు పలు అవార్డ్స్‌ను కూడా సొంతం చేసుకుని ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. పలు చిత్రాల్లో హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక 2021లో ‘షీర్ క్వీన్’(Sheer Queen) తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. ఈక్రమంలోనే స్వర పొలిటికల్ లీడర్ నమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ఫహద్ అహ్మద్‌(Fahad Ahmed)ను ప్రేమించింది. ఇక వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2023లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరిని షాక్‌కు గురి చేశారు. అధికారికంగా మాత్రం ఫిబ్రవరి 16న ప్రకటించడంతో అంతా శుభాకాంక్షలు తెలిపారు.

వీరికి ఓ కూతురు పుట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, స్వర భాస్కర్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. తన అకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి కారణం ఆమె కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ స్వర తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘నేను చేసిన రెండు ఫొటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కానీ నేను మాత్రం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. అయితే నేను పెట్టిన పోస్టులు ఏంటంటే.. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో గాంధీ హమ్ శర్మిందా హై తేరే ఖాతిల్ జిందగీ హై అనే నినాదం ఉన్న ఫొటో పెట్టాను.

అలాగే నా కూతురు జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆమె మొహాన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అని పోస్ట్ చేశా. నా స్వంత బిడ్డ చిత్రం. ఇది కాపీరైట్ ఉల్లంఘన ఎలా అవుతుంది? నా పిల్లల పోలికపై కాపీరైట్ ఎవరికి ఉంది. ఈ రెండు పోస్టుల వల్ల నా అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేశారు. ఇలాంటి నిర్ణయాలు నాకు హాస్యాస్పదంగా ఉన్నాయి. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం స్వర పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు స్ట్రాంగ్‌గా ఉండమని సలహా ఇస్తున్నారు.. కొందరు మాత్రం అన్నింటిలో బ్లాక్ చేస్తారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed