Trivikram : ప్రతి నెల అద్దె కట్టిమరీ ఆ గదిలో ఉంటున్న త్రివిక్రమ్.. బయటపడిన అసలు నిజం?

by Prasanna |
Trivikram :  ప్రతి నెల అద్దె కట్టిమరీ ఆ గదిలో ఉంటున్న త్రివిక్రమ్.. బయటపడిన అసలు నిజం?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ ( Trivikram Srinivas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను తీసిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియోట్ చేశాయి. కుటుంబ కథలు, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ కథలను రాయడంలో మాటల మాంత్రికుడికి సాటి ఎవరూ లేరు. ఈయన ఏ మూవీ తీసినా స్టార్ హీరోలకు మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం, పలు మూవీలతో బిజీగా ఉన్నాడు. కానీ, అతడు స్టార్ గా గుర్తింపు పొందడానికి త్రివిక్రమ్ ఎన్నో కష్టాలు పడ్డారని, వాటి వెనుక ఒక గది ఉందని, దానికి ఇప్పటికీ అద్దె కడుతున్నారని తెలుస్తోంది. అసలు, ఆ రూమ్ కి , త్రివిక్రమ్ కి మధ్య సంబంధం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

కెరీర్ మొదట్లో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. త్రివిక్రమ్ , కమెడియన్ సునీల్ కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వారట. ఈ ఇంట్లో ఉంటున్న సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ.. నిద్రలేని రాత్రులను గడిపారు. ఇలా తాను ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేవరకు ఆ అద్దె గది లోనే ఎన్నో హిట్ సినిమాలకు కథలు రాశారట , అది వారికి బాగా కలిసొచ్చిందని, త్రివిక్రమ్ ని డైరెక్టర్ గా , సునీల్ ని స్టార్ కమెడియన్ గా చేసిందని చెబుతుంటారు. ఆ ఇల్లు పంజాగుట్ట లో ఉంది. ఇక, ఆ రూమ్ ని సెంటిమెంట్ గా భావిస్తూ ఇప్పటికి , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ గదికి నెలకు ఐదు వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారని పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలిపారు.

Next Story