Toxic: రిలీజ్‌కు ముందే రికార్డుల్లోకి యాష్ ‘టాక్సిక్’..

by sudharani |
Toxic: రిలీజ్‌కు ముందే రికార్డుల్లోకి యాష్ ‘టాక్సిక్’..
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). అంతర్జాతీయం (International)గా ప్రశంసలు పొందిన గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్లోబల్ ఆడియెన్స్ (global audience) కోసం ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రం (Indian film)గా టాక్సిక్ రికార్డుల్లోకి ఎక్కింది. ఫైనల్‌గా యష్ టాక్సిక్ మూవీ హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలలో రాబోతోన్న టాక్సిక్ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాధించేలా రూపొందిస్తున్నాం. అందుకే కన్నడ, ఆంగ్ల భాషల్లో తెరకెక్కిస్తున్నాం. మా ఈ చిత్రం అన్ని సరిహద్దుల్ని చెరిపివేస్తుందని భావిస్తున్నాం. అన్ని భాషల, సాంస్కృతిక ప్రపంచాన్ని కలిపేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు. నిర్మాత వెంకట్ కే నారాయణ మాట్లాడుతూ.. ‘‘టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే చిత్రంగా టాక్సిక్‌ను రూపొందిస్తున్నాం. మొదటి నుంచీ ఈ కథపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ప్రతిభను కూడా ప్రదర్శించేలా టాక్సిక్ రాబోతోంది’ అని అన్నారు.

Next Story

Most Viewed