బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో కిర్రాక్ ఫొటోస్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. బాలీవుడ్ క్వీన్ అంటూ కామెంట్స్

by Kavitha |
బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో కిర్రాక్ ఫొటోస్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. బాలీవుడ్ క్వీన్ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’(Lakshmi Kalyanam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.

అయితే మ్యారేజ్ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. బాబు పుట్టాక పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం ‘సత్యభామ’(SatyaBhama) అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస అవకాశాలు అందుకుంటూ యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తుంది. ఇక రీసెంట్‌గానే మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాలో పార్వతీ దేవి(Parvathi Devi)గా కనిపించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తుంది.

అలా ఓ పక్కా భర్త, బాబుతో మరో పక్క సినిమాలతో లైఫ్‌ను లీడ్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ అవుట్ ఫిట్ ధరించి స్టైలీష్ లుక్‌లో ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి ‘ రీసెంట్లీ అవుట్ ఫిట్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ‘బాలీవుడ్ క్వీన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.


Next Story