- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఎవరు పుట్టారంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ‘బావ’మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు నటిగా తనకంటూ సపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ ఈ బ్యూటీకి అనుకున్నంత స్టార్‌డమ్ అయితే రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్‌గా మారిపోయింది. అలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలో సమంత సిస్టర్‌గా నటించింది ఈ అమ్మడు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో అంతగా కనిపించలేదు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన స్నేహితుడు నితిన్ రాజును పెళ్లి చేసుకుని ప్రణీత సినిమాలకు దూరమైంది. అయితే వీరికి కొన్ని నెలల క్రితం ఓ పాప కూడా జన్మించింది.
ఇదిలా ఉంటే.. ప్రణతి మళ్లీ రీసెంట్‌గా సెకండ్ టైం గర్భవతి అయిందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో బేబి బంప్‌తో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రణీత రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ప్రణీత పండంటి బాబుకు జన్మనిచ్చింది. బిడ్డతో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ అమ్మడికి కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.