Tripti Dimri: నేడు యానిమల్ బ్యూటీ బర్త్డే..నెట్టింట వైరలవుతోన్న నటి లైఫ్‌స్టైల్ డిటైయిల్స్

by Anjali |
Tripti Dimri: నేడు యానిమల్ బ్యూటీ బర్త్డే..నెట్టింట వైరలవుతోన్న నటి లైఫ్‌స్టైల్ డిటైయిల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2017 లో పోస్టర్ బాయ్య్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ త్రిప్తి డిమ్రి. తర్వాత రొమాంటిక్ డ్రామాగా వచ్చిన లైలా మజ్ను లో ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. త్రిప్తి 202 లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ.. మొదటి సినిమాతోనే యువతను పిచ్చోళ్లను చేసింది. బోల్డ్ గా దర్శనమిచ్చి కుర్రాళ్ల హార్ట్ కొల్లగొట్టింది.

అయితే నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. 31 ఏళ్లలోకి అడుపెట్టిన సందర్భంగా ఈ బోల్డ్ బ్యూటీ ఆస్తి, లైఫ్ స్టైల్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిప్తి డిమ్రికి దాదాపు ఇరవై, ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని జనాలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ అండ్ మూవీస్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించుకున్నట్లు టాక్. ఈ ముద్దుగుమ్ము ఒక్కో చిత్రానికి 40 నుంచి 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో బ్రాండ్ పోస్ట్‌కు దాదాపు 60 నుంచి 90 వేల రూపాయలు అందుకుంటుందట.

అంతేకాకుండా వీటితో పాటుగా.. ఈ అమ్మడుకు ముంబయిలోని బాంద్రాలో రూ. 14 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసిందట. అక్కడ భారీ బడ్జెట్‌ ఇళ్లలో త్రిప్తి ఇల్లు ఒకటి అని సమాచారం. అలాగే రూ. 1. 36 కోట్ల విలువైన వట్ కలర్ పోర్స్చే కయెన్ ఎస్ యూవీ కారు ఉందట. దీన్ని త్రిప్తికి నచ్చిన ఆలివ్ గ్రీన్ రంగులోకి ఛేంజ్ చేసుకున్నట్లు టాక్. ఈ కారుతో పాటు రెనాల్ట్ డస్టర్ కూడా ఉందట. మరీ ఈ వివరాలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed