Pawan Kalyan: 'ఇది సార్ డిప్యుటీ సీఎం రేంజూ'.. డిజాస్టర్ సినిమాలతో సరికొత్త రికార్డ్

by Prasanna |
Pawan Kalyan: ఇది సార్ డిప్యుటీ సీఎం రేంజూ.. డిజాస్టర్ సినిమాలతో సరికొత్త రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : అప్పటి రోజుల్లో ఒక సినిమా హిట్ అవ్వడమే గొప్ప విషయంగా చెప్పేవాళ్ళు. హిట్ అయితే ఎన్ని రోజులు ఆడిందనేది మాత్రమే రికార్డ్స్ గా ఉండేది. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 360 రోజులు ఇలా పోస్టర్లు వేసే వారు. టీవీలు లేని రోజుల్లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యేవి. నెమ్మది నెమ్మదిగా ట్రెండు మారడంతో ఎన్ని సెంటర్స్ లో ఆడింది? ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది చెప్పడం మొదలు పెట్టారు. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ , డిజాస్టర్ సినిమాలకు కూడా రూ. 85 కోట్లకి పైగా వసూలు చేసిన రికార్డు క్రియోట్ చేశాడు. టాలీవుడ్ లో ఈ హీరోకి తప్ప ఇలాంటి రికార్డు ఏ హీరోకి లేదు. మరి, ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

అజ్ఞాతవాసి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన " అజ్ఞాతవాసి" సినిమా పవర్ స్టార్ కెరియర్లో పెద్ద డిజాస్టర్. సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సర్దార్ గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ సినీ కెరిర్లో " సర్దార్ గబ్బర్ సింగ్ " అట్టర్ ఫ్లాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది.

కాటమరాయుడు

" కాటమరాయుడు" మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ బొమ్మ తెరమీద కనిపించడం వలనే టికెట్లు బుక్ అయ్యాయి. ఈ సినిమా లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ట్రేడ్ వ‌ర్గాల‌కు కూడా షాక్ ఇచ్చింది.

Next Story