- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bachhala Malli: బచ్చలమల్లి చిత్రం నుంచి మూడో పాట వచ్చేసింది..!
దిశ, వెబ్‌డెస్క్: సుబ్బు మంగదేవి(Subbu Mangadevi) దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’(Bachhala Malli). ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు అల్లరి నరేష్(Allari Naresh) కీలక పాత్రలో నటించారు. అమృత అయ్యర్(amrutha ayyar) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar) సంగీతాన్ని సమకూర్చారు. అలాగే హాస్యా మూవీస్ బ్యానర్(hasya Movies Banner) పై రాజేశ్ దండా(Rajesh Danda), బాలాజీ గుత్తా(Balaji Gutta)లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ నెల (డిసెంబరు) 20 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనున్న ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా బచ్చలమల్లి సినిమా నుంచి మూడో పాట విడుదల చేశారు. ‘మరీ అంత కోపం’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి(Director Hanu Raghavapudi) చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అల్లరి నరేస్ కొత్త సినిమా నుంచి వరుస అప్డ్టేట్స్ వదలడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.