నొప్పిగా ఉందన్నా పట్టించుకోరు.. వారికి మానవత్వం లేదంటూ పవన్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్!

by Hamsa |
నొప్పిగా ఉందన్నా పట్టించుకోరు.. వారికి మానవత్వం లేదంటూ పవన్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నిత్యామీనన్(Nithya Menen) విభిన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ‘అలా మొదలైంది’(Ala Modalaindi ) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ‘తిరుచిత్రంబలం’(Thiruchitrambalam) మూవీకి ఏకంగా జాతీయ అవార్డును అందుకుని ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ‘కాదలిక్క నేరమిల్లై’(Kadhalikka Neramillai) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా జనవరి 14న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘హీరోయిన్ల ఆరోగ్యం విషయంలో కొంతమంది మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారు. మహిళల బాధలను పట్టించుకోకుండా పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరు. ఎంతకష్టం అయినా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కు హాజరు కావాలని అంటారు.

ఇండస్ట్రీలో చాలా చోట్ల ఇలాంటి అమానవీయత ఉంటుంది. మనమే అలాంటి వాటికి అలవాటు పడాలి. ఏది జరిగినా మనం కష్టపడటానికి వచ్చాం అనుకుని వెళ్లాల్సిందే. నేను కూడా ఇలాంటి ఇబ్బందికర విషయాలను ఎదుర్కొన్నాను. అలాగే కొన్నిచోట్ల పరిశీలించాను. కానీ ఇందులో నా ఫ్రెండ్, నటుడు మిస్కిన్ మాత్రం ఉండడు. ఎందుకంటే..అతను పీరియడ్స్ పెయిన్‌ను అర్థం చేసుకుని విశ్రాంతి తీసుకోమని చెప్తాడు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed