యుద్ధం మళ్లీ తలెత్తుతోంది.. హీరో ఆసక్తికర ట్వీట్

by Hamsa |
యుద్ధం మళ్లీ తలెత్తుతోంది.. హీరో ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: పీఎ విజయ్(Vijay) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అగాథియా: ఎంజెల్స్ vs డెవిల్స్’(Aghathiyaa: AngelsVs Devil). ఇందులో హీరో జీవా, అర్జున్ సర్జా(Arjun Sarja) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాశి ఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్, వామిడ్ బ్యానర్స్‌పై డాక్లర్ ఇస్తారి, అనీష్ అర్జున్ దేవ్(Anish Arjun Dev) నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ చిత్రం జనవరి 31న విడుదల కావాల్సి ఉండగా.. గ్రాఫిక్-ఇంటెన్సివ్ పనులు పూర్తి చేయడంలో ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, జీవా ట్విట్టర్ ద్వారా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అలాగే ‘‘ఒకప్పుడు నీడలో జరిగిన యుద్ధం మళ్లీ తలెత్తుతోంది. దేవదూతలు కాంతిని కాపాడుతారు. దెయ్యాలు చీకటిని పాలిస్తాయి. అయితే మధ్యమధ్యలో.. కొత్త విధి రాస్తోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినీ ప్రియులంతా ‘అగాథియా’ కోసం ఈగర్‌గా వెయట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed