- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఛావాతో పాటు థియేటర్లలో రిలీజ్ కానున్న ఆ సినిమా టీజర్.. నెట్టింట హైప్ పెంచుతున్న న్యూస్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రష్మిక మందన్న బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా(Ayushman Khurana) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ ‘థామా’(Thama). దినేష్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్నారు.
మడాక్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్(Teaser) ఫిబ్రవరి 14న ఛావా సినిమాతో పాటుగా థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా రెండు కాలాల మధ్య కథతో తెరకెక్కుతున్న ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దీపావళి(Diwali) సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.