మోస్మరైజింగ్ పోస్టర్‌తో ‘8 వసంతాలు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్..

by Hamsa |
మోస్మరైజింగ్ పోస్టర్‌తో ‘8 వసంతాలు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్..
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్(Anantika Sanilkumar) ‘మ్యాడ్’(Mad) సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. ప్రస్తుతం అనంతిక, ఫణీంద్ర(Phanindra) దర్శకత్వంలో ‘8 వసంతాలు’ మూవీ చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. దీనికి తెలుగులో సూపర్ హిట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇందులో మార్షల్ ఆర్ట్స్‌ను ప్రధానంశంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ‘8 వసంతాలు’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అన్ని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. ఇందులో అనంతిక శుద్ది అయోధ్య పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే..తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ జనవరి 24న శుద్ది వరల్డ్‌లోకి వెళ్తారు అంటూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో హీరో, హీరోయిన్ మంచుతో కొట్టుకున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.

Advertisement
Next Story

Most Viewed