- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంచు కొండల్లో రెస్టారెంట్ పెట్టిన స్టార్ హీరోయిన్.. ఆ స్పెషల్ డే నాడే ఓపెనింగ్ అంటూ పోస్ట్

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి గత కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన పోస్టులతో వివాదాలు సృష్టిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ ఇంత కూడా బెదురు లేకుండా తనకు అనిపించింది నెట్టింట పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అయితే ఈ అమ్మడు చాలా రోజుల తర్వాత ఇటీవల ‘ఎమర్జెన్సీ’(Emergency) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు ముందు పలు వివాదాలు ఎదుర్కోవడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ విషయంపై కంగనా కూడా చాలా సార్లు సోషల్ మీడియా ద్వారా తన బాధను పంచుకుంది. ఇక ఎట్టకేలకకు ఈ మూవీ జనవరి 17న విడుదలైంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కంగనా రాజకీయాలపై ఫోకస్ పెట్టింది.
నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి పోస్టులు పెడుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కంగనా హిమాలయాల్లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులు పెట్టింది. తన చిన్న నాటి కల సజీవంగా ఉందని ఎమోషనల్ అయింది. అయితే ఈ ఆలోచన మాత్రం అమ్మగారు వంటగదిలో ఉన్నప్పుడే వచ్చిందని వెల్లడించింది. అయితే ఈ రెస్టారెంట్‌ను మాత్రం ఆధునిక టచ్‌తో హిమాచలీ కళాఖండాలతో పాటు సుందరమైన పర్వత దృశ్యాలతో బహిరంగ సీటింగ్ వంటి సదుపాయాలతో నిర్మించింది. ఇక ఇందులో హిమాచల్ ఫుడ్‌ను అందించనున్నట్లు సమాచారం.
ఈ మేరకు కంగనా ‘‘పర్వతాలు నా ఎముకలు, నదులు నా సిరలు, అడవులు నా ఆలోచనలు, నక్షత్రాలు నా కలలు. జీవితం గురించి స్వచ్ఛమైన అర్థాన్ని కనుకొనే ప్రదేశం ఇదే’’ అని రాసుకొచ్చింది. అలాగే రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. పుట్టిన ఊరు మనాలిలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన ఆమె కస్టమర్లకు ఫుడ్ సర్వీస్ చేస్తున్న వీడియోను కూడా పెట్టింది. ఇక చూడడానికి ఎంతో అద్భుతంగా ఉన్న హిమాలయాల్లో రెస్టారెంట్ పెట్టి అమ్మడు అందరినీ ఫిదా చేసేసింది. ఇక ఈ రెస్టారెంట్ మాత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఓపెనింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా ఇక లవ్ స్టోరీ లాంటిదే అని అభిప్రాయపడింది. ఇక కంగనా పోస్టులు చూసిన వారంతా చుట్టూ పర్వతాల మధ్య వేడి వేడి ఫుడ్ మంచు పడుతున్న వేళలో ఆస్వాదిస్తుంటే ఆ ఫీలింగ్ వర్ణించలేనిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.