ఆ స్టార్ హీరోతో డిన్నర్ చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
ఆ స్టార్ హీరోతో డిన్నర్ చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ‘రాంబంటు’(Rambantu) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది.

ఇక దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నలుగురు పిల్లల తల్లిగా, వెంకటేష్ భార్య నటించిందన్న సంగతి తెలిసిందే. ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కడ హీరో విజయ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. మీరు ఏ హీరోతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నారని అడుగగా.. దానికి ఆమె రిప్లై ఇస్తూ.. ‘దళపతి విజయ్ అంటే నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం. ఒకవేళ నాకు అతనితో డిన్నర్ చేసే చాన్స్ వస్తే అస్సలు వదులుకోను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Next Story