Sitara: ఆకట్టుకుంటోన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ఫొటో షూట్..!

by Anjali |
Sitara: ఆకట్టుకుంటోన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ఫొటో షూట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Tollywood senior hero superstar Mahesh Babu) గారాల పట్టి సితార (Sitara) క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. వెకేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, తన డ్యాన్స్ వీడియోలు నెట్టింట షేర్ చేసి.. ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. సితారకు ఈ ఏజ్‌లోనే హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. తండ్రికి తగ్గ కూతురిగా గుర్తింపు సొంతం చేసుకుంటోంది. సితార ఇప్పటికే మహేష్ బాబు సినిమాలో తండ్రితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

ఓ ఇంటర్వ్వ్యూలో నమ్రతకు సితార సినీ ఎంట్రీ గురించి ప్రశ్న కూడా ఎదురైంది. నటనపై తనకు ఇంట్రెస్ట్ ఉందని నమ్రత చెప్పడంతో సూపర్ స్టార్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సితార నిన్న సంక్రాంతి సందర్భంగా ఓ అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. పింక్ కలర్ లెహంగా ధరించి.. సింపుల్ లుక్‌లో జనాల్ని ఆకట్టుకుంటోంది. సితార వెనకున్న అన్ని దేవుళ్ల ఫొటో అందరినీ మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఘట్టమనేని గారాల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story