- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘టాక్సిక్’ సెట్‌లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

దిశ, సినిమా: స్టార్ హీరో యశ్(Yash), గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘టాక్సిక్’ (Toxic). దీనిని కేవీఎన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్(Monster Mind Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంగా గోవా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ యాక్టర్స్ మాత్రమే కాకుండా బ్రిటిష్ యాక్టర్స్ అయినటువంటి డారెల్ డీ సిల్వా, బెనెడిక్ట్ గ్యారెట్ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. అలాగే టోవినో థామస్, సుదేవ్ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఇయర్‌లోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో రాకింగ్ స్టార్ యష్ సోదరిగా నటిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ విలాసవంతమైన సెట్‌లో జరుగుతుందట. ఇక ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్‌లో నయనతార జాయిన్ అయినట్లు సమాచారం. దీంతో ఆమె ఎంట్రీతో టాక్సిక్ టీమ్‌కు మరింత ఉత్సాహానిచ్చిందనే చెప్పాలి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా రాకింగ్ స్టార్ యష్ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. నేడు పాన్ ఇండియా స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ఇతను నటించిన కేజీఎఫ్-1,2లు ఎంతగా హిట్ అయి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం టాక్సిక్ మూవీతో పాటు ‘రామాయణం’(Ramayanam) వంటి భారీ బడ్జెట్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతను నెగెటివ్ రోల్(రావాణాసురుడు) కనిపించనున్నాడు. కాగా సాయిపల్లవి(Sai Pallavi) సీతగా.. రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా కనిపించనున్నాడు.