Suhas: సుహాస్ సినిమాలో సర్‌ఫ్రైజింగ్‌గా స్టార్ డైరెక్టర్ రోల్.. హైప్ పెంచేస్తున్న నిర్మాత కామెంట్స్

by sudharani |
Suhas: సుహాస్ సినిమాలో సర్‌ఫ్రైజింగ్‌గా స్టార్ డైరెక్టర్ రోల్.. హైప్ పెంచేస్తున్న నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ (Suhas) నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayo Rama). ఈ సినిమాతో మలయాళ (Malayalam) నటి మాళవిక మనోజ్ (Malvika Manoj) హీరోయిన్‌గా పరిచయమవుతోంది. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్న ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకన్న ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

అంతే కాకుండా.. ఆయన గెస్ట్‌ రోల్‌ అందరిని సర్‌ఫ్రైజ్‌ (Surprise) చేస్తుందట. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్‌ హరీష్‌ శంకర్‌ను ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘సుహాస్‌ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది ఉంటుంది. ఇందులో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్‌ ఉంటుంది. ఈ చిత్రంలోని వినోదం ఆడియన్స్‌ను ఎంతో ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. హరీష్‌ శంకర్‌ అడ్గగానే మా చిత్రంలో అతిథి పాత్రను చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. ఈ వేసవిలో ఓ భామ అయ్యో రామ బెస్ట్‌ ఎంటర్ టైనర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed