Chiranjeevi.. Odela: నా హీరోతో సినిమా తీస్తున్న.. నాచురల్ స్టార్ సంచలన ప్రకటన

by sudharani |   ( Updated:2024-12-03 16:23:14.0  )
Chiranjeevi.. Odela: నా హీరోతో సినిమా తీస్తున్న.. నాచురల్ స్టార్ సంచలన ప్రకటన
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఇప్పుడు తన కల నేరవేర్చుకోబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి బిగ్గెస్ట్ అభిమాని. ఈ క్రమంలోనే ఓదెల తన మూడో ప్రాజెక్టుగా చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అవే వార్తలు నిజం చేస్తూ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) వచ్చేసింది. ఇక్కడ ఇంకో సర్‌ప్రైజింగ్ (surprising) విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల్ కాంబోలో రాబోతున్న చిత్రానికి నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నాని X వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఆయన స్ఫూర్తితో నేను పెరిగాను.. ఆయన సినిమాల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడేవాడిని.. ఆఖరికి నా సైకిల్ కూడా పోగొట్టుకున్నా. ఆయన మాకొక వేడుక.. ఇప్పుడు ఆయన్నే నేను ప్రదర్శిస్తున్నాను.. భూమీ గుండ్రంగా ఉంటుందంటే ఇదేనేమో.. మెగాస్టార్ చిరంజీవిని మరితం కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఆ కల సాకారం కాబోతోంది’ అనే ఓ క్యాప్షన్ ఓడించి చేతికి రక్తం కారుతున్న ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు. కాగా.. ‘హంసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు’ అంటూ షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకిత్తిస్తోంది.

Read More...

Pawan Kalyan: హరిహర వీరమల్లు కేవలం సినిమా కాదు.. కొండంత హైప్ పెంచిన జనసేన నేత




Advertisement

Next Story

Most Viewed