కరోనాకి ముందు సౌత్ హీరోయిన్స్‌ని అలా చూసేవారు.. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-01-30 07:10:14.0  )
కరోనాకి ముందు సౌత్ హీరోయిన్స్‌ని అలా చూసేవారు.. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా(Regina Cassandra) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘శివ మనసులో శృతి’(Shiva Manasulo Sruthi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. ‘కొత్త జంట’(Kotha Janta), ‘పిల్ల నువ్వు లేని జీవితం’(Pilla nuvvu leni Jeevitham) చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ‘నేనే నా’(Nene Naa) సినిమాలో నటించింది. అయితే నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకున్న ఈ అమ్మడుకు స్టార్ స్టేటస్ రాలేదనే చెప్పాలి. ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌(Tollywood)లో అవకాశాలు రావడమే ఆగిపోయాయి. దీంతో బాలీవుడ్(Bollywood), కోలీవుడ్(Kollywood) పై కన్నేసి అక్కడికి చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ భామ ‘విదాముయార్చి’(Vidamuyarchi) అనే మూవీలో నటిస్తోంది. స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar), హీరోయిన్ త్రిష(Trisha) జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మాగిజ్ తిరుమేని(Magij Thirumeni) దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో అర్జున్(Arjun) కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక అర్జున్‌కి జోడిగా రెజీనా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృదం ప్రమోషన్ల జోరు పెంచింది. ఈ నేపథ్యంలో రెజీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. గతంలో గడ్డు పరిస్థితులు ఉండేవి. దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. అప్పట్లో మీరు సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే చాన్సులు ఇచ్చేవాళ్ళు కాదు.

దానికి భాషా పరమైన ఇబ్బందులు కూడా ఓ కారణమై ఉండవచ్చు. కానీ, కరోనా తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. సౌత్‌కు చెందిన సినీ తారలకు ఇప్పుడు వాళ్లు కూడా అవకాశాలు ఇస్తున్నారు. తమ సినిమాలను ఎక్కువమంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడం కోసం వారు దక్షిణాది తారలను ఎంచుకోవడం అవసరంగా మారింది. అయితే నేను ఇప్పటి వరకు ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు. రీసెంట్‌గానే ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకు సంతకం చేశాను. త్వరలో దాని విశేషాలు మీతో పంచుకుంటాను’ అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story