- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డిఫరెంట్ టైటిల్‌తో రాబోతున్న సిద్ధార్థ్.. నెట్టింట క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్ టీజర్

దిశ, సినిమా: హీరో సిద్ధార్థ్(Siddharth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాయ్స్’(Boys) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘బొమ్మరిల్లు’(Bommarillu) మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’(Nuvvostanante Nenoddantana) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి మెప్పించాడు. కానీ టాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోగా రాణించలేకపోయాడు. కానీ కోలీవుడ్(Kollywood)లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకున్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. హీరోయిన్ అతిధి రావు హైదరి(Athidi Rao Hydari)ని ప్రేమించి గత ఏడాది పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో మరోపక్క మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. హీరో సిద్ధార్థ్, శ్రీ గణేష్(Sri Ganesh) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్(Title Teaser)ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ మూవీకి ‘3BHK’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ప్యూర్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌గా రానున్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్(Amrith Ramnath) సంగీతం అందిస్తున్నారు. అరుణ్ విశ్వ(Arun Vishwa) ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. కాగా ఈ సినిమాలో శరత్ కుమార్(Sarathkumar), దేవయాని(Devayani), మీతా రఘునాథ్(Meetha Raghunath), చైత్ర(Chaitra), యోగిబాబు(Yogi Babu) వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక టైటిల్‌ను గమనించినట్లయితే.. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే విషయాలు మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్లు అర్థమవుతుంది. అలాగే సాధారణ గుమాస్తా అయిన ఓ తండ్రి, ఇంట్లో అందరి పనులు చూసుకునే తల్లి.. వారికి ఓ కొడుకు, కూతురు.. వారి కల.. అనే నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు ఈ టైటిల్ టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచిందనే చెప్పవచ్చు.