అక్షయ్ కుమార్ సినిమాపై సిద్ధార్థ్ కౌంటర్లు? సెన్సేషనల్ ట్వీట్ వైరల్

by Hamsa |
అక్షయ్ కుమార్ సినిమాపై సిద్ధార్థ్ కౌంటర్లు? సెన్సేషనల్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), వీర్ పహారియా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘స్కై ఫోర్స్’(Sky Force). సందీప్ కేవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్(Abhishek Anil Kapoor) దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో సారా అలీఖాన్(Sara Ali Khan), సిమ్రత్ కౌర్, శరద్ ఖేల్కర్, మనీష్ చౌదరి(Manish Chaudhary) కీలక పాత్రలో కనిపించారు. అయితే దీనిని దినేష్ విజాన్, జ్యోతి దేశ్‌పాండే(Jyoti Deshpande), అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జనవరి 24న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో.. తాజాగా, బాలీవుడ్ నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) పెట్టిన సెటైరికల్ ట్వీట్ ఒకటి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో ‘స్కై ఫోర్స్’ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ నెటిజన్లు మాత్రం అక్షయ్ గురించే చేశాడని అంటున్నారు. అందులో ఏముందంటే.. ‘‘అభద్రత కొత్త కనిష్టాలను తాకింది! నేను ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను!

ఇన్ సెక్యూరిటీతో ఉంటే ఎప్పటికీ ఎదగం.. అది మనల్ని కిందకు లాగేస్తుంది.. మన మీద మనకు నమ్మకం ఉండాలి. పక్క వాడి దీపం ఆర్పితే మన దీపం వెలిగి పోదు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఇక అసలు సిద్దార్థ్ ఆనంద్‌ ఇలా ఎందుకు అన్నాడు కారణం ఏమై ఉంటుంది.. అక్షయ్‌తో గొడవలా అని పలు రకాలుగా జనాలు చర్చించుకుంటున్నారు. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ గురించే మాట్లాడి ఉంటాడని, ఆ మూవీ మీదే కౌంటర్లు వేశాడని అంటున్నారు.

Next Story