శ్రుతి హాసన్ పెళ్లి అయిపోయింది.. బాయ్ ఫ్రెండ్‌తోనే..

by John Kora |
Shruthi Hassan, Shanthanu Hazarika
X

దిశ, సినిమా: స్టార్ నటి శృతి హాసన్ ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ 'శాంతను హజారికా' కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తమ రిలేషన్‌, పెళ్లిపై వస్తున్న వార్తలను ఉద్దేశిస్తూ మొదటిసారిగా ఓపెన్ అయ్యాడు శాంతను. 'నేను ఎల్లప్పుడూ ఆమె నుంచి ప్రేరణ పొందుతాను. ఆమె కూడా నా నుంచి ప్రేరణ పొందుతానని చెబుతుంది. ఆమెతో గడిపిన ఏ క్షణం కూడా విసుగు అనిపించదు. అది మా మధ్య ఉన్న బలమైన సంబంధం. సంప్రదాయబద్ధమైన పెళ్లికి టైమ్ ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ, ప్రస్తుతానికి క్రియేటివ్ మ్యారేజ్ అయితే అయిపోయింది' అన్నాడు. అంతేకాదు తాను శ్రుతి కలిసి ఒకే గదిలో కొన్ని గంటల తరబడి గడుపుతామని.. చిన్న చిన్న విషయాలను పెద్దది చేస్తూ చిరాకు పడకుండా ఉన్నప్పుడే ప్రేమ మరింతగా వికసిస్తుందని శాంతను అన్నాడు.

https://www.instagram.com/p/CRWWQfuFXsE/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed