Seerat Kapoor: ప్రజెంట్ నేను సింగిల్.. ప్రేమికుల రోజు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పేస్తా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2025-02-10 17:34:16.0  )
Seerat Kapoor: ప్రజెంట్ నేను సింగిల్.. ప్రేమికుల రోజు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పేస్తా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సిద్దు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) హీరోగా, సీరత్ కపూర్ (Seerat Kapoor), షాలినీ, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela). ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డైరెక్టర్ రవికాంత్ తెరకెక్కించాడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందించిన ఈ మూవీ 2020లో ఆహాలో స్ట్రీమింగ్ అయింది. కరోనా కారణంగా ఈ సినిమాను డైరెక్ట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ చేయడంతో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే పేరుతో ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానున్నట్లు రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఇందులో భాగంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌ (Hyderabad)లో సందడి చేసింది సీరత్ కపూర్. ఈ సందర్భంగా ఈ వాలెంటైన్స్ డే (Valentine's Day) ప్లాన్ ఏంటీ అనే ప్రశ్న ఈ బ్యూటీకి ఎదురవ్వగా.. ‘వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏం లేవు. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. మింగిల్ కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. వాలెంటైన్స్ డే రోజు ఎవరైనా రోజా ఫ్లవర్ ఇస్తే తీసుకుంటాను’ అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Next Story