Dil Ruba: ఓయ్ కిరణ్ అబ్బవరం ఇంకేమి దొరకలేదా అంటూ హీరోయిన్ పోస్ట్.. హీరో రియాక్షన్ ఏంటంటే?

by sudharani |
Dil Ruba: ఓయ్ కిరణ్ అబ్బవరం ఇంకేమి దొరకలేదా అంటూ హీరోయిన్ పోస్ట్.. హీరో రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: గతేడాది ‘నా సామిరంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ రుక్సర్‌ ధిల్లాన్ (Ruksar Dhillon) నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌రూబా’ (Dilruba). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తున్న ఈ మూవీకి విశ్వకరుణ్ (Vishwakaran) దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 14న ‘దిల్‌రూబా’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఇక ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ఇందులో భాగంగా.. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ (Second single) ‘హే జింగిలి’ (HeyJingili) ఫిబ్రవరి 18న సాయంత్రం 5:01 గంటలకు రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ పోస్ట్‌ను ఉద్దేశిస్తూ.. హీరోయిన్ రుక్సర్‌ ధిల్లాన్‌ తన X ఖాతా వేదికగా.. ‘ఓయ్ కిరణ్ అబ్బవరం ఇంకేమి దొరకనట్టు.. బుజ్జీ, బంగారం కాకుండా ఈ జింగిలి జింగిలి ఏంటీ?’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య జనాలు పిలుచుకునే పిలుపులు కంటే ‘జింగిలి’ చాలా బాగుంటుంది లే’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతుండగా.. ‘కొత్త రకం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..? బాగుంది బాగుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ చిత్రాన్న శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యాడ్లీ ఫిలింతో కలిసి సంయుతకంగా నిర్మిస్తున్నారు.

Next Story

Most Viewed