- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sathi Leelavathi: ఎట్టకేలకు మెగా కోడలి సినిమా షూటింగ్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా వరుణ్ తేజ్(పోస్ట్)

దిశ, సినిమా: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు. అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మళ్లీ మరో సినిమా ప్రకటించలేదు. అయితే రీసెంట్‌గా లావణ్య పుట్టిన రోజు సందర్భంగా ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటించబోతున్నట్లు తెలిపింది. ఇక అప్పటి నుంచి లావణ్య మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. వివరాల్లోకి వెళితే..
లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్(Dev Mohan) ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1 చిత్రంగా ‘సతీ లీలావతి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తాతినేని సత్య(Tatineni Sathya) దర్శకత్వం వహిస్తుండగా.. నాగమోహన్ బాబు.ఎమ్(M. Mohanbabu), రాజేష్.టి(T. Rajesh) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్, అన్నే రవి, డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ సహా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు.
అయితే ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ కొట్టగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ.. ‘‘ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్‌గా ‘సతీ లీలావతి’ రూపొందుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో సినిమా తెరకెక్కుతుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జోడీ ఫ్రెష్ లుక్‌తో మెప్పించనున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.