Sarangapani jathakam: 'అలేఖ్య చిట్టి పికెల్స్‌'ను వాడేసుకున్న సారంగపాణి జాతకం టీం

by D.Reddy |   ( Updated:2025-04-09 16:16:45.0  )
Sarangapani jathakam: అలేఖ్య చిట్టి పికెల్స్‌ను వాడేసుకున్న సారంగపాణి జాతకం టీం
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు సినిమా ప్రమోషన్లు అంటే.. ట్రైలర్ లాంఛ్‌లు, ఆడియో ఫంక్షన్లు, టీవీ ఇంటర్వ్యూలు ఉండేవి. కానీ, ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దీంతో మూవీ మేకర్స్ కూడా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వింత వింత వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఏది ట్రెండింగ్‌లో ఉండే అదే తరహాలో ప్రమోషన్స్‌‌తో ప్రేక్షకుల్లోకి వెళ్తున్నారు. ఇటీవల గ్రోక్ ట్రెండ్ అవ్వటంతో 'రాబిన్‌హుడ్', 'మ్యాడ్ స్వ్కేర్' సినిమా మేకర్స్ ప్రమోషన్స్ కోసం గ్రోక్‌ను ఏ విధంగా వాడుకున్నారో తెలిసిందే. అయితే, తాజాగా ప్రియదర్శి హీరోగా రాబోతోన్న 'సారంగపాణి జాతకం' మేకర్స్ కూడా ఈ తరహా ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు.

ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'అలేఖ్య చిట్టి పికెల్స్' (Alekhya chitti pickles) పేరు తెలియని వారుండరు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు అయినా ముగ్గురు అక్కచెల్లెళ్లు 'అలేఖ్య చిట్టి పికెల్స్' పేరుతో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించారు. అయితే, వీళ్ల పికెల్స్ కొనాలనుకున్న ఓ కస్టమర్‌ను అసభ్యకరంగా తిట్టిన ఆడియో లీక్ అవ్వటంతో నెట్టింట తీవ్ర దూమారం రేగుతున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌లో ధరలు ఎందుకు ఇంత అధికంగా ఉన్నాయని ఆ కస్టమర్ ప్రశ్నించాడు. ఇందుకు ఆ అమ్మాయి బూతులు తిడుతూ కెరియర్ మీద ఫోకస్ చెయ్యి.. పచ్చళ్లే కొనలేని వాడివి పెళ్లి చేసుకుని పెళ్ళానికి బంగారం ఏం కొనిపెడతావు అంటూ కామెంట్లు చేసింది. దీంతో ఈ ఆడియోని మీమర్స్ రకరకాలుగా ఉపయోగించుకుంటూ అక్కాచెల్లెళ్లను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam). ఎన్నో వాయిదాల అనంతరం ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఇందుకోసం చిత్రబృందం 'అలేఖ్య చిట్టి పికెల్స్' ట్రోల్స్‌ను వాడేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ప్రియదర్శి ఒక పుస్తకం చదువుతూ ఉండగా రూప ఫోన్‌లో ఒక డ్రెస్ చూపిస్తూ ప్రియదర్శిని ఈ డ్రెస్ బాగుంది కదా అని అడుగుతుంది. దానికి ప్రియదర్శి చాలా బాగుంది కానీ ధర ఎందుకంతా ఎక్కువ ఉందంటూ ఆశ్చర్యపోతాడు. దీంతో వెంటనే రూప దయచేసి నువ్వు కెరియర్ పైన ఫోకస్ పెట్టు.. ఇప్పుడప్పుడే ప్రేమ, పెళ్లిళ్ల జోలికి వెళ్ళకంటూ సలహా ఇస్తుంది. ముష్టి డ్రెస్సే రేట్ ఎక్కువ అన్నవాడివి.. రెప్పోద్దున పెళ్లి అయ్యాక ఆ పిల్లకి బంగారం, ల్యాండ్ ఎలా కొనిపెడతవంటూ కామెంట్లు చేసింది. దీనిని సరే పచ్చళ్ల బిజినెస్ పెడుతా అంటూ ప్రియదర్శి సమాధానం ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అంత సీరియస్ గొడవని కూడా ఇప్పుడు సిల్లీ చేసేసారని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed