- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్లీజ్ నాగార్జున సార్ అంటూ ఆ విషయం గురించి బ్రతిమిలాడుతున్న రష్మీ.. ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ యాంకర్ రష్మీ(Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్‌లో మెప్పించిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే హీరోయిన్‌గా కూడా చాన్స్‌లు దక్కించుకుంది. అలా రెండు మూడు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా స్టార్ డమ్ రాలేదు. దీంతో బుల్లితెరకు వచ్చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో అయినటువంటి జబర్దస్త్ షో(Jabardasth Show)లో యాంకరింగ్ స్టార్ట్ చేసింది. అక్కడ తనకు వచ్చీ రానీ తెలుగుతో ఆడియన్స్‌ను ఫుల్ నవ్వించింది.
అయితే కమెడియన్ అయిన సుడిగాలి సుధీర్(Sudugali Sudheer)తో రీల్ లవ్ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయింది. అక్కడ అతనితో ఆడీ పాడీ ప్రేక్షకుల్లో నిజంగానే వీరు రియల్ జోడీ అన్నంతగా ఫేమ్ తెచ్చుకుంది. ప్రజెంట్ రష్మీ.. జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి కంపెనీ షో(Sridevi Company Show)కి కూడా యాంకరింగ్ చేస్తుంది. ఇక దీనికి టాలీవుడ్ సీనియర్ యాక్టర్ ఇంద్రజ(Indraja) జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అప్పట్లో రష్మీ ‘యువ’(Yuva) అనే సీరియల్ లోనూ నటించింది. యూత్‌ను మెప్పించే కంటెంట్‌తో వచ్చిన ఈ ధారావాహిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యువ సీరియల్ క్లిప్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రీసెంట్‌గా.. ఈ సీరియల్‌లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) గెస్ట్‌గా కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రష్మీ, రాజమౌళి క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఆ సీరియల్ హాట్ టాపిక్‌గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ రష్మీ అలానే ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ సీరియల్ గురించి రష్మీ స్పందిస్తూ.. హీరో నాగార్జునకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పోస్ట్ చేస్తూ.. యువ సీరియల్ రీ యూనియన్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది.. ప్లీజ్ నాగార్జున సార్ అంటూ అక్కినేని హీరోకు రిక్వెస్ట్ పెట్టింది రష్మీ గౌతమ్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి నాగ్ ఈ అమ్మడికి రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.