ఎన్టీఆర్‌కు అత్తగా స్టార్ హీరోయిన్.. ఈ కాంబినేషన్ పిచ్చెక్కిపోద్ది అంటున్న నెటిజన్లు

by sudharani |   ( Updated:2023-08-15 11:31:17.0  )
ఎన్టీఆర్‌కు అత్తగా స్టార్ హీరోయిన్.. ఈ కాంబినేషన్ పిచ్చెక్కిపోద్ది అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెరవనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ న్యూస్ వైరల్ అవుతుంది.

అందుతున్న సమాచారం మేరకు.. ‘దేవర’ సినిమాలో రమ్యక్రిష్ణను ఎన్టీఆర్ అత్త క్యారెక్టకు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. గతంలో వచ్చిన ‘నా అల్లుడు’ సినిమాలో రమ్యక్రిష్ణ, ఎన్టీఆర్‌కు అత్తగా చేసిన విషయం తెలిసిందే. ఇక మరోసారి వీరి కాంబినేషన్ నిజం అయితే అదిరిపోద్ది అంటున్నారు నెటిజన్లు. కాగా.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది.

Read More: రణ్‌వీర్ సింగ్ అందరి ముందు నా కాళ్ళు పట్టుకున్నాడు.. వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్

Advertisement

Next Story