Rakul: ‘లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సమయం’ అంటూ టాలీవుడ్ నటి పోస్ట్

by Anjali |
Rakul: ‘లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సమయం’ అంటూ టాలీవుడ్ నటి పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో వరుస సినిమాలతో దూసుకుపోయింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది. వరుస అవకాశాలు అందుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఏకంగా అగ్ర హీరోల సరసన కూడా నటించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమలో అడుగు పెట్టింది.

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) సరసన నటించి నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. తర్వాత రఫ్(Ruff) సినిమాలో నటించింది. స్టార్టింగ్‌లో చిన్న హీరోలతో నటించి మంచి పేరు దక్కించుకుంది. తర్వాత సీనియర్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్, నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని వంటి సీనియర్ కథానాయకుల సరసన నటించి మరింత ఫేమ్ దక్కించుకుంది. కానీ తర్వాత ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీ(Jackie Bhagnani)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు వీరు నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉండి.. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వివాహం చేసుకున్నారు. రకుల్ అండ్ జాకీ భగ్నానీ గత ఏడాది ఫిబ్రవరి 21 వ తేదీన గోవాలో సిక్కు.. ఆనంద్ కరాజ్ పద్ధతుల ద్వారా పెళ్లి చేసుకున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో గ్రాండ్‌గా వివాహం జరిగింది. వీరి పెళ్లికి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదిక తాజాగా భర్తపై ఓ పోస్ట్ పెట్టింది. పోస్ట్ ద్వారా భర్త భగ్నానీపై ప్రేమను తెలియజేసింది. ‘ఒక సంవత్సరం లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సమయం’’ అంటూ రాసుకొచ్చింది. వీడియోలో నువ్వు లేని రోజులు రోజులుగా అనిపించవు. మీరు లేకుండా ఎంత టేస్టీ ఫుడ్ అయినా తినడం సరదా కాదంటూ మాటలు జోడించింది. ప్రస్తుతం రకుల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed