- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rakul Preet Singh: ‘హాట్ చాక్లెట్ ఎవరికి కావాలి’ అంటూ అల్లు అర్జున్ బ్యూటీ పోస్ట్..

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఏకంగా అగ్ర హీరోల సరసన నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
స్టార్ అండ్ హాట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరైన ఈ బ్యూటీ టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) సరసన నటించి నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Dialogue King Sai Kumar) కుమారుడు ఆది సాయికుమార్ (Adi Saikumar)సరసన రఫ్ చిత్రంలో కూడా నటించి తన సత్తా చాటింది. మొదట్లో చిన్న కథానాయకులతో నటించినా.. తర్వాత సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan), (Megastar Chiranjeevi), నాగార్జు, రవితేజ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun), రామ్ పోతినేని (Ram potineni) వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకుని మరింత ఫేమ్ దక్కించుకుంది.
ఇక రకుల్ కు పోను పోను సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ఈ బ్యూటీ పెళ్లి విషయానికొస్తే.. నార్త్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన విక్కీ భగ్నానీ (Vicky Bhagnani)ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. తరచూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు కూడా అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. చేతిలో గ్లాస్ పట్టుకుని ఈ హాట్ చాక్లెట్ ఎవరికీ కావాలి అంటూ పోస్టుకు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. రకుల్ చేతిలో చాక్లెట్ పట్టుకున్న ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రజెంట్ ఈ హీరోయిన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.