- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rakshasa: ‘రాక్షస’ నుంచి రాబోతున్న మ్యూజికల్ అప్డేట్.. నెట్టింట హైప్ పెంచుతున్న ట్వీట్

దిశ, సినిమా: కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్(Prajwal Devaraj), లోహిత్ హెచ్(Lohith H) కాంబోలో రాబోతున్న తాజా మూవీ ‘రాక్షస’(Rakshasa). ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడ(Kannada)తో పాటు తెలుగు(Telugu)లోనూ రిలీజ్ చేయనున్నారు. అయితే గతంలో శివరాజ్ కుమార్(Shivarajkumar) నటించిన ‘వేద’(Veda) చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ(MVR Krishna) ‘రాక్షస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. కూతురుపై ఉన్న ప్రేమతో ఇందులో హీరో చేసిన యాక్షన్ సీన్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. అంతేకాకుండా నోబిన్ పాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై బజ్‌ను పెంచగా, తాజాగా విడుదలైన టైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి అనే చెప్పవచ్చు.
ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రాక్షస నుంచి మ్యూజికల్ అప్‌డేట్(Musical Update) రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘రాక్షస ప్రపంచం నుండి ఒక ప్రధాన సంగీత నవీకరణ ఈరోజు ఉదయం 9 గంటలకు వస్తుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ మూవీ నుంచి ఎలాంటి మ్యూజికల్ అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.