- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తతో ఎఫైర్ పెట్టుకుందనే కారణంతో ఆ హీరోయిన్‌ని చితక్కొట్టిన Raadhika..?
దిశ, వెబ్ డెస్క్: సినీయర్ హీరోయిన్ రాధిక ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎక్కువగా చిరంజీవి సరసన నటించి హిట్ పెయిర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే రాధిక మూడు పెళ్లిళ్లె చేసుకుని ఇండస్ట్రీలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. మొదట ప్రతాప్ పోతేన్ అనే తమిళ నటుడుని చేసుకొని ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి రీఛార్డ్ హర్డి అనే వ్యక్తిని పెళ్ళాడింది. ఓ కూతురు పుట్టాక మనస్పర్థలు రావడంతో అతనితో కూడా విడిపోయింది.
ఆ తర్వాత తమిళ స్టార్ హీరో శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆయనతోనే కలిసి ఉంటుంది. అయితే గతంలో ఓ స్టార్ హీరోయిన్ శరత్ కుమార్ తో ప్రేమలో పడి శరత్ కుమార్ ని రాధిక నుండి దూరం చేయాలనుకుందట. ఇక విషయం తెలిసిన రాధిక ఆ హీరోయిన్ ని చితక్కొట్టిందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరో కాదు సౌత్ నార్త్ ఇండస్ట్రీలను అప్పట్లో ఒక ఊపు ఊపిన నటి నగ్మా. నగ్మా గతంలో శరత్ కుమార్ తో ప్రేమలో పడి సహజీవనం కూడా చేసిందట.
అయితే ఈ విషయం తెలుసుకున్న రాధిక తన నుంచి తన భర్తను ఎక్కడ దూరం చేస్తుందోనని నగ్మా ని చితక్కొట్టిందట. అంతేకాదు నువ్వు నా భర్తను వదిలి వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చిందట. దాంతో ప్రాణభయంతో నగ్మా రాత్రికి రాత్రే ముంబై పారిపోయిందట. ఆ తర్వాత నగ్మా మళ్లీ శరత్ కుమార్ వైపు చూడలేదట.
Also Read: మీ మాట నేనెందుకు వినాలి.. నేను నాలాగే ఉంటాను: నెటిజన్ల సలహాలపై Sara Ali Khan