- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Priyanka chopra: అక్కడ ఆస్తులు అమ్మకం.. హైదరాబాద్‌లో కొంటున్న ప్రియాంక చోప్రా.. అందుకోసమేనా?

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka chopra) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018లో అమెరికాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నికోలస్ జెర్రీ జోనాస్‌ని (Nicholas Jerry Jonas) ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఎక్కవగా హాలీవుడ్‌పై (Hollywood) దృష్టి సారిస్తోన్నారు. అంతేకాదు, హాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ముంబైలో ఆమె ఆస్తులకు సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం భర్త నిక్, కుతూరు మేరీ చోప్రా జోనస్‌లతో కలిసి ప్రియాంక చోప్రా లాస్ ఏంజెలెస్‌లో ఉంటున్నారు. అలాగే, పర్మినెంట్‌గా అక్కడే సెటిల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఆమెకు చెందిన పలు విలువైన ఆస్తులను అమ్ముతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు ఫ్లాట్‌లను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రియాంకకు గోవా, న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్‌లలో సొంత ఇల్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆమె హైదరాబాద్‌లో ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో #SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైదరాబాద్‌లో ఇల్లు కొన్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని మేకర్స్ దాదాపుగా రూ.1200 కోట్లు బడ్జెట్ వెచ్చించి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రియాంక చోప్రా గతంలో రామ్ చరణ్‌తో కలిసి గతంలో 'జంజీర్' (తెలుగులో తుఫాన్) సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే.. హాలీవుడ్‌లో 'హెడ్స్ ఆఫ్ స్టేట్', 'ది బ్లఫ్' చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే, ప్రముఖ అమెరికన్ వెబ్‌సిరీస్ 'సిటడెల్'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Read More..
బాలీవుడ్‌లో ‘నేనే నంబర్ 1’.. హిందీ ఇండస్ట్రీని శాసిస్తున్న సౌత్ భామ