- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘డాకు మహారాజ్’ సక్సెస్.. అల్లు అర్జున్ కామెంట్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ రిప్లై!

దిశ,వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అయితే.. సంక్రాంతి(Sankranthi) బరిలో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న ‘డాకు మహారాజ్’ చిత్ర నిర్మాతలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అభినందనలు తెలిపారు. తాజాగా ఆయన నిర్మాత నాగవంశీ(Produced by Nagavanshi)కి ఓ బొకేని పంపి తన విషెస్ అందజేశారు. డాకు మహారాజ్ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇక దీనికి సంబంధించిన నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా(Social Media)లో రిప్లై ఇచ్చారు. ఇలా తన సినిమా సక్సెస్‌పై బన్నీ అభినందనలు అందించడం సంతోషంగా ఉందంటూ నాగ వంశీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.