- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pushpa-3: అల్లు ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. పుష్ప-3 పై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) ఎలాంటి విజయాన్ని సాధించిందో అందిరికి తెలిసిందే. 2021లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా (Pan India) రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. దీనికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఇక సమంత ‘ఊ అంటవా మామ’ అంటూ ఐటెమ్ సాంగ్‌లో మెరిసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో భాగంగా దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప-2’ తెరకెక్కించగా.. గతేడాది డిసెంబర్(December)లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.
పార్ట్ 2లో యంగ్ బ్యూటీ శ్రీలీల ‘కిస్సిక్’ అంటూ ఓ ఊపు ఊపేసింది. అయితే.. ‘పుష్ప 2’ చివరిలో పుష్ప 3 కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. కానీ, పుష్ప-2 రిలీజ్ తర్వాత కొన్ని అనివార్య సంఘటనలు జరగడంతో ‘పుష్ప-3’ ఉండదు అనుకున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత రవిశంకర్ (Ravi Shankar) సూపర్ అప్‌డేట్ ఇచ్చాడు. నితిన్ (Nitin) నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. ‘2028లో పుష్ప 3 సినిమాను విడుదల చేస్తాము’ అని తెలిపారు. అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు. నిర్మాత రవిశంకర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో.. అట్లీతో సినిమా కంప్లీట్ అయ్యాక పుష్ప-3 (Pushpa-3) ఉంటుంది కావచ్చు అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.